ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి.. రాగి తీగలు దోచేసి..

0

అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని బోర్లం గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి మూడు విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అందులోని రాగి తీగలు, ఆయిల్ ను దొంగిలించారు. ఆదివారం ఉదయం గ్రామస్థులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి విద్యుత్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఏఈ అనిల్ కుమార్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రాగి తీగల విలువ రూ.1.80 లక్షలు ఉంటుందని ఏఈ పేర్కొన్నారు.