అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: తాము కిడ్నాప్‌లకు పాల్పతున్నట్లు వస్తున్న పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని ట్రాన్స్‌జెండర్లు రక్ష, జరీనా, శ్యామల అన్నారు. సోమవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్, రుద్రూర్‌లో తమపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రోడ్లపై చిన్న పిల్లలు కనిపిస్తే ఆశీర్వదించి వెళ్తామని.. అందరి మేలు కోరుకునే వాళ్లమని చెప్పారు. సమావేశంలో ట్రాన్స్‌జెండర్లు హారతి, గంగా, ప్రియ, ప్రజ్ఞా, అలకనంద పాల్గొన్నారు.
Advertisement
Advertisement