అక్షరటుడే, ఇందూరు: ఆర్టీసీలో ఉత్తమ శిక్షణ కలిగిన డ్రైవర్లు ఉంటారని.. ఇందులో ప్రయాణం సురక్షితమని డీటీవో ఉమామహేశ్వరరావు అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రమాద రహిత సర్వీస్ రికార్డు కలిగిన ఆర్టీసీ డ్రైవర్లను శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో ప్రమాద రహిత డ్రైవర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడం అభినందనీయమన్నారు. అలాగే బైక్పై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనం ఇవ్వకూడదని తెలిపారు. అనంతరం రీజనల్ మేనేజర్ జ్యోత్స్న మాట్లాడుతూ.. ప్రమాదాల రేటు 0.9 నుంచి 0.8కి తగ్గిందని తెలిపారు. ఆయా విభాగాల్లో మొత్తం 21 మంది అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో ఎంవీఐ కిరణ్ కుమార్, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు సరస్వతి, శంకర్, పర్సనల్ ఆఫీసర్ పద్మజ, నిజామాబాద్ డిపో–1 మేనేజర్ ఆనంద్, డిపో–2 మేనేజర్ సాయన్న, బోధన్ డిపో మేనేజర్ శ్రీనివాస్, బాన్సువాడ డిపో మేనేజర్ సరితా దేవి తదితరులు పాల్గొన్నారు.
