అక్షరటుడే, ఇందూరు: విద్యాభివృద్ధికి ప్రతి పాఠశాల యాజమాన్యం కృషి చేయాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శివరాత్రి యాదగిరి, రమణా రావు అన్నారు. నగరంలోని సందీప్ గార్డెన్లో శుక్రవారం ట్రస్మా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర కోశాధికారి జయసింహా గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిత్యానందం, అరుణ్, కోశాధికారి మధు, అసోసియేట్ ప్రెసిడెంట్ నరసింహారావు, అర్బన్ అధ్యక్షుడు ధర్మరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాగరాజు ఆయా మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement