అక్షరటుడే, హైదరాబాద్: Travel bus : గోవా Goa tour వెళ్దామనుకున్న హైదరాబాద్ ప్రయాణికులకు ఓ ట్రావెల్ బస్సు hyderabad to goa Buses చుక్కలు చూపించింది. జాలీ ట్రిప్ తో ఎంజాయ్ చేద్దామనుకున్న వారిని జీహెచ్ఎంసీ పరిధి కూడా దాటలేకుండా చేసింది. చివరికి ప్రయాణం వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై ప్రయాణికుల ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్(zero FIR) నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 17న హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు 25 మంది ప్రయాణికులు తరుణి ట్రాన్స్ పోర్టు అండ్ లాజిస్టిక్స్(Taruni Transport and Logistics)కు చెందిన ఏసీ బస్సు కోసం రెడ్ బస్ యాప్(Red Bus app)లో టికెట్స్ బుక్ చేసుకున్నారు. ప్రయాణం అదే రోజు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది.
కాగా, బస్సు ఎక్కిన ప్రయాణీకులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఏసీ పనిచెయ్యడం లేదు, టైర్లు చిరిగిపోయాయి. ఇంజిన్ ఆయిల్ లీక్ అవుతోంది. లోపల దారుణమైన వాసన వస్తోంది. ఇదేంటని ఎంత ప్రశ్నించినా.. బస్సు సిబ్బంది నుంచి రెస్పాన్స్ లేదు. దీంతో ప్రయాణికులు ఎస్సార్ నగర్ మెట్రో స్టేషన్(Essar Nagar Metro Station) వద్ద బస్సు ఆపి అందరూ ఆందోళనకు దిగారు. ప్రయాణికుల్లో ఒకరైన సిద్దిపేట వాసి మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో జీరో FIR నమోదు అయ్యింది. కేసును LB నగర్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. అక్కడి స్టేషన్ పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.