అక్షర టుడే, వెబ్ డెస్క్ Snake Venom : అందరికీ తెలుసు. పాము కరిస్తే ఏమౌతుందో? విష పూరితమైన పాములు కరిస్తే ఇక అంతే. వెంటనే యాంటీ డోస్ (Anti-dose) ఇవ్వకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. యాంటీ డోస్ సమయానికి దొరక్కపోయినా కూడా కష్టమే. అసలు యాంటీ డోస్ ఎలా తయారు చేస్తారో తెలుసా? పాము విషంతోనే. అవును.. పాము విషంతోనే యాంటీ డోస్ తయారు చేస్తారు. ఆ యాంటీ డోస్ బాడీలోకి వెళ్లాక పాము విషాన్ని విరిగేలా చేస్తుంది. అలా మనిషి ప్రాణాలు నిలుస్తాయి.
మన దేశంలోనే ప్రతి సంవత్సరం పాము కాటు (Snake Venom) వల్ల కొన్ని వేల మంది చనిపోతున్నారు. సుమారుగా 80 వేల నుంచి లక్షా 38 వేల వరకు పాము కాటు వల్ల మరణిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. వాళ్లను కాపాడుకోవడానికి ఒకే ఒక్క దారి యాంటీ వెనమ్ వాయల్స్ ఇవ్వడం. అలాంటి యాంటీ డోస్ లన్నీ ఎక్కువగా తమిళనాడులోని ఓ ట్రైబ్ అందిస్తుంది. ఇరులా ట్రైబ్ అనే గిరిజనులు పాము విషాన్నే ఒక బిజినెస్ గా ఎంచుకున్నారు.
Snake Venom : రోజూ వేల పాములను పట్టడమే వీళ్ల పని
తమిళనాడులోని అటవీ ప్రాంతాల్లో ఉండే ఈ తెగ గిరిజనులు పాము విషాన్నే (Snake Venom) బిజినెస్ గా మార్చుకున్నారు. ప్రతి రోజు వేల పాములను పట్టడమే వీళ్ల పని. పాములను పట్టి వాటి నుంచి విషాన్ని తీసి స్టోర్ చేస్తారు. పట్టిన పామును పట్టినట్టే కుండలో పెట్టి వాటిని కొన్ని రోజులు తమ వద్దనే ఉంచుకొని వాటి నుంచి కావాల్సినంత విషాన్ని సేకరించాక వాటిని తిరిగి అడవిలో వదిలిపెడతారు. ఒకేసారి 800 వరకు పాములను పట్టి వాటితో పాము విషాన్ని సేకరిస్తారు. అలా ఇప్పటి వరకు కొన్ని లక్షల పాముల నుంచి విషాన్ని సేకరించారు. దాన్నే బిజినెస్ గా (Business) మార్చుకొని తమ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. యాంటీ వెనమ్ తయారు చేసే చాలా కంపెనీలు వీళ్ల దగ్గర్నుంచే పాము విషాన్ని (Snake Venom) సేకరిస్తాయి.