అక్షరటుడే, ఇందూరు: KISAN SANGH : భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ వాసి కొండల సాయి రెడ్డిని మంగళవారం బీజేపీ నాయకులు సన్మానించారు. కిసాన్ సంఘ్ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అయన జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, యెండల సుధాకర్ సాయిరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement