Donald Trump : వెనక్కి తగ్గాల్సిందే.. లేదంటే అదనపు సుంకాలు తప్పవు ​చైనాకు ట్రంప్ వార్నింగ్

Donald Trump : చైనా వెనక్కి తగ్గాల్సిందే.. లేదంటే అదనపు సుంకాలు తప్పవు డ్రాగన్​కు ట్రంప్ వార్నింగ్
Donald Trump : చైనా వెనక్కి తగ్గాల్సిందే.. లేదంటే అదనపు సుంకాలు తప్పవు డ్రాగన్​కు ట్రంప్ వార్నింగ్

అక్షరటుడే, వెబ్ డెస్క్ Donald Trump : అమెరికా (US Tariffs) విధించిన సుంకాలకు దీటుగా స్పందించిన చైనాకు (China) డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) వార్నింగ్ ఇచ్చారు. చైనా తన ప్రతీకార ప్రణాళికలను ఉపసంహరించుకోకపోతే మరిన్ని అదనపు సుంకాలను విధిస్తానని హెచ్చరించారు. చైనాపై ట్రంప్ (Donald Trump) ఇటీవల 34 శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్ కూడా తగ్గేది లేదన్నట్లు యూఎస్ పై 34 శాతం అదనంగా టారిఫ్లు పెంచింది.

Advertisement

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ (Donald Trump) మంగళవారం లోపు చైనా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. లేకపోతే ఏప్రిల్ 9 నుంచే 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశంతో జరుపుతున్న చర్చలు కూడా నిలిపి వేస్తామని స్పష్టం చేశారు. టారిఫ్లపై ఇతర దేశాలు కోరుకుంటే వారితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Trump Tariff | మరింత ముదిరిన అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌.. 245 శాతానికి సుంకాలు పెంచిన ట్రంప్

Donald Trump : పెరుగుతున్న ఆందోళనలు..

అమెరికా (America) అధ్యక్షుడు మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సుంకాల మోతతో అన్ని దేశాల మార్కెట్లు (Countries markets) కకావికలమయ్యాయి. అమెరికాతో పాటు చైనా, జపాన్, భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు, ట్రంప్ వైఖరిని వ్యతిరేకిస్తూ అమెరికాలో నిరసనలు మిన్నంటుతున్నాయి. అయినప్పటికీ ట్రంప్ మాత్రం వెనుకాడడం లేదు. దీర్ఘకాలంలో అమెరికాకు మంచి జరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement