అక్షరటుడే, జుక్కల్: విద్యుత్తు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19న పెద్ద కొడప్గల్, నిజాంసాగర్, పిట్లం విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు నిజాంసాగర్ మండల ట్రాన్స్కో అధికారి లక్ష్మణ్ తెలిపారు. పెద్ద కొడపగల్ సబ్ స్టేషన్ ఆవరణలో కార్యక్రమం ఉంటుందని.. విద్యుత్ సమస్యలు ఉన్న వినియోగదారులు ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.