TTD | టీటీడీపై ఎంపీ రఘునందన్​రావు కీలక వ్యాఖ్యలు

TTD | టీటీడీపై ఎంపీ రఘునందన్​రావు కీలక వ్యాఖ్యలు
TTD | టీటీడీపై ఎంపీ రఘునందన్​రావు కీలక వ్యాఖ్యలు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | తిరుమల వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది తెలంగాణ భక్తులు(TTD DARSHAN) దర్శించుకుంటారు. అయితే టీటీడీ TTD మాత్రం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడం లేదు. దీనిపై తాజాగా మెదక్​ ఎంపీ(MP) రఘునందన్​రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని శుక్రవారం ఆయన దర్శించుకొని మీడియా పాయింట్​ వద్ద మాట్లాడారు.

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) ఆదేశించారని, టీటీడీ కూడా నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తు చేశారు. అయినా ఇప్పటి వరకు ఇది అమలులోకి రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 1 నుంచే సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని టీటీడీ పాలకమండలి చెప్పినా నేటికి అమలు కావడం లేదన్నారు. తమ లేఖలను పట్టించుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరం కలిసి తిరుమలకు వచ్చి టీటీడీతో తేల్చుకుంటామని వ్యాఖ్యానించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  TTD | సిఫార్సు లేఖలపై టీటీడీతో తేల్చుకుంటాం : ఎంపీ రఘునందన్