TTD Budget | రూ.5,400 కోట్లతో టీటీడీ బడ్జెట్​
TTD Budget | రూ.5,400 కోట్లతో టీటీడీ బడ్జెట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్:TTD Budget | టీటీడీ​ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనం(Annamayya Bhavan)లో టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరాని(financial year)కి బడ్జెట్​ ఆమోదించనున్నారు.

Advertisement
Advertisement

రూ.5,400 కోట్లతో బడ్జెట్​ ప్రవేశ పెట్టనున్నారు. పలు కీలక అంశాలపై ఈ మీటింగ్​లో చర్చించి ఆమోదం తెలుపనున్నారు. దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక ట్రస్ట్(special trust) ఏర్పాటుపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే నిపుణుల కమిటీ చేసిన పలు సిఫార్సులకు మండలి ఆమోదం తెలపనుంది.

కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక టీటీడీలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement