అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్(జనరల్) దర్శనాలను ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 2008లో టీటీడీ సంకల్పించిన ఈ పథకాన్ని అనివార్య కారణాలతో నిలిపివేశారు. అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

•⁠ ⁠అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా ఐదుగురు కుటుంబ సభ్యులకు సంవత్సరానికి 3 రోజులు వీఐపీ బ్రేక్ (జనరల్)దర్శనాలకు అనుమతిస్తారు.

•⁠ ⁠రూ.2,500/- టారిఫ్‌లో ఏడాదికి 3 రోజులు వసతి కల్పిస్తారు.

•⁠ ⁠సంవత్సరానికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందిస్తారు.

•⁠ ⁠దాతల మొదటిసారి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50-గ్రాముల వెండి నాణెం బహుమానంగా ఇస్తారు.

•⁠ ⁠సంవత్సరానికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు అందిస్తారు.

•⁠ ⁠విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుంచి 25 ఏళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది.