Advertisement

అక్షరటుడే, ఇందూరు: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలోని నాన్ టీచింగ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు వినతిపత్రం అందించడానికి జిల్లా నాయకులు, వర్కర్లు హైదరాబాద్ తరలి వెళ్లారు. ఇందులో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఈశ్వరి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హేమలత, సుమలత, నాయకులు శశికళ, సునీత, భవిత, శైలజ, సబితా, సువర్ణ, నవ్య, సువినా తదితరులున్నారు.

Advertisement