అక్షరటుడే, ఇందూరు : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలోని ఉపాధ్యాయులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తపస్‌ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి సూచించారు. సోమవారం ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంలో జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణవేణి, బద్రీనాథ్‌, రాష్ట్ర బాధ్యులు వరప్రసాద్‌, కీర్తి సుదర్శన్‌, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.