అక్షరటుడే, ఇందూరు: turmeric board | జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి హోటల్లో మంగళవారం పసుపు కొనుగోలుదారులు, విక్రేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న పసుపు కొనుగోలుదారులు తెలంగాణపై దృష్టి సారించేందుకు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మద్దతు ధర కంటే ముందు పసుపు నాణ్యతపై దృష్టి సారించాలని కోరారు.
బోర్డు ఏర్పాటైన తర్వాత రైతులకు మద్దతు ధరపై కూడా కసరత్తు చేస్తున్నామన్నారు. అనంతరం ఆయా కంపెనీల ప్రతినిధులు, రైతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ పసుపు పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడారు. సమావేశంలో జాతీయ పసుపు బోర్డు సెక్రెటరీ భవానీశ్రీ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి, స్పైసిస్ బోర్డు డైరెక్టర్ రేమాశ్రీ, డిప్యూటీ డైరెక్టర్ సుందరీషన్, అసిస్టెంట్ డైరెక్టర్ విజిష్ణ తదితరులు పాల్గొన్నారు.