అక్షరటుడే, ఇందూరు: Turmeric farmers | పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు. దీంతో ఒక్కసారిగా వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
తమకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పసుపు రైతులు సోమవారం నగరంలోని బస్టాండ్ ఎదుట ధర్నాకు దిగారు. జిల్లాలో పసుపు పండిస్తున్న రైతులంతా మార్కెట్ యార్డుకు వచ్చి అక్కడి నుంచి నేరుగా బస్టాండ్ ఎదుట మండుటెండలో నిరసన చేపట్టారు. మార్కెట్‌యార్డులో పసుపు పంటకు ధర రాకుండా వ్యాపారులు, దళారులు తమను మోసం చేస్తున్నారన్నారు.
ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అయినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. మరోవైపు నగరం నడిబొడ్డున రైతులు ధర్నాకు దిగడంతో నలుమూలలా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.