అక్షరటుడే, కామారెడ్డి: సినీనటుడు మోహన్ బాబును అరెస్ట్ చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ.. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఆబిద్, ఆర్గనైజేషన్ సెక్రెటరీ రజాక్, శ్రీకాంత్, రామేశ్వర్, శంకర్, శివ, చక్రధర్ యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.