అక్షరటుడే, వెబ్ డెస్క్: రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా విక్రయించే స్టాంప్ పేపర్లకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఈ స్టాంప్ పేపర్ల అవసరం పడుతుంది. ఇంత కీలకమైన పత్రాల పట్ల ఓ కార్యాలయం సిబ్బంది నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా వాటికి నిర్లక్ష్యపు చెదలు పట్టుకుంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.12 లక్షల విలువ చేసే స్టాంప్ పేపర్లు చెదలు పట్టి ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఇవన్నీ కూడా వంద రూపాయల స్టాంప్ పేపర్లుగా సమాచారం. నిజామాబాద్ రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పనిచేసే రికార్డు రూం అసిస్టెంట్ వల్లే ఈ తప్పిదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఏదేమైనా ఓ ఉద్యోగి తప్పిదం వల్ల రూ.లక్షల విలువ చేసే పత్రాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి.