అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ వంద పడకల ఆస్పత్రిలో 26 మంది స్టాఫ్‌నర్సులను నియమించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగరాజు గురువారం తెలిపారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత విషయమై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి వినయ్ కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామ న్నారు. ఇటీవల వైద్యారోగ్య శాఖ మంత్రికి సైతం వినతిపత్రం అందజేయగా ఆస్పత్రిలో స్టాఫ్ నర్సులను నియమించారని పేర్కొన్నారు.
స్టాఫ్‌నర్సుల నియామకం హర్షణీయం!

అక్షరటుడే: ఆర్మూర్ వంద పడకల ఆస్పత్రిలో 26 మంది స్టాఫ్‌నర్సులను నియమించడం హర్షణీయమని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి గురువారం పేర్కొన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు, వైద్య పరికరాల కొరతపై తాను అసెంబ్లీలో ప్రస్తావించగా ప్రభుత్వం స్పందించి ఆస్పత్రికి స్టాఫ్ నర్సులను కేటాయించడం స్వాగతిస్తున్నామన్నారు. అలాగే వైద్య పరికరాలు, అంబులెన్స్ కూడా కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.