అక్షరటుడే, వెబ్డెస్క్: Kiran Royal | తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్‌పై సంచలన అరోపణలు చేసి కేసులు పెట్టిన లక్ష్మిరెడ్డి తాజాగా యూ టర్న్ తీసుకుంది. కిరణ్ స్వతహాగా మంచివాడు, తనకు అతనిపై ఎలాంటి వ్యతిరేకత లేదని పేర్కొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కిరణ్ రాయల్ వీడియోలను తన వద్ద నుంచి ఏడాది కిందటే జనసేన నేత ఒకరు తీసుకున్నట్లు పేర్కొంది. సోషల్ మీడియాలో పోస్టులు సైతం తాను చేసినవి కాదని తెలిపింది.
కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేస్తూ లక్ష్మిరెడ్డి అధారాలతో సహా మీడియా ముందుకు వచ్చి వీడియోలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తనను కోటి 20 లక్ష్లల రూపాయలు మోసం చేసి, అన్ని రకాలుగా వాడుకున్నట్లు సంచలన అరోపణలు చేసింది. ఆరోపణల నేపథ్యంలో పరస్పరం ఫిర్యాదులు చేయడంతో కేసులు సైతం నమోదయ్యాయి. కాగా ఊహించని పరిణామంలో లక్ష్మిరెడ్డిని ఓ కేసులో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయడం, ఆపై బెయిల్‌పై ఆమె విడుదల కావడం జరిగిపోయాయి.
తాజాగా మీడియా ముందుకు వచ్చి గతం గతః అంటూ రాజీ మంత్రం పఠిచింది. ఇకపై తనకు కిరణ్ రాయల్ కు మధ్య వివాదాలు ఉండవంది. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు సైతం తాను బాధ్యురాలిని కాదంది. తన దగ్గరున్న వీడియోలను ఏడాది క్రితమే జనసేనకు చెందిన ముఖ్యనేత ఒకరు తీసుకున్నట్లు పేర్కొంది. రాజకీయ పార్టీలు తన ఉదంతాన్ని వారికి అనుకూలంగా వాడుకున్నట్లు తెలిపింది. కిరణ్ రాయల్‌తో ఆర్థిక వ్యవహారాలు సర్ధుబాటు చేసుకున్నట్లు వెల్లడించింది. కాగా ఈ ఎపిసోడ్ కు ఇంతటితో ముగింపు ఇవ్వాలనుకున్న కిరణ్ రాయల్ ఆమెతో రాజీ చేసుకున్నట్లుగా సమాచారం. ఆమె డిమాండ్ చేస్తున్న డబ్బులు ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం సద్దుమణిగినట్లే