అక్షరటుడే, ఇందూరు : Makloor | ట్రాక్టర్‌తో ఢీకొని ఒకరిని హత్య చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ North Rural CI Srinivas తెలిపారు. మాక్లూర్ Makloor మండలం చిక్లీ గ్రామానికి Chikli village చెందిన చిన్న గంగారాంను, అదే గ్రామానికి చెందిన కారం నవీన్, ఎడగొట్టి ప్రసాద్ హత్య చేశారు. గంగారాం తనకు ఉన్న అప్పులతో భూమిని విక్రయించాలి అనుకున్నాడు. ఆ భూమిని కారం నవీన్ తన బావ brother-in-law నీరడి ముత్తన్న పేరు మీద కొనుగోలు చేశాడు.
అయితే ఎడగొట్టి ప్రసాద్ అనే వ్యక్తికి గంగారాంనకు మధ్య మాటలు లేవు. ఈ భూమిని నవీన్ ప్రసాద్ కోసం కొనుగోలు చేశాడని తెలుసుకున్న నవీన్ బాండ్ పేపర్ bond paper రాయడానికి నిరాకరించాడు. అయితే ఆ భూమి మాత్రం నవీన్ సాగు land చేసుకుంటున్నాడు. కానీ గంగారాం ఏటా పంటను నాశనం చేసేవాడు. గ్రామంలో పంచాయతీ grama Panchayat పెట్టిన సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఈ నెల 13న పంట కోసే సమయంలో గంగారాం, నవీన్‌తో గొడవ పడ్డాడు. దీంతో నవీన్ ఎలాగైనా గంగారాంను హత్య చేయాలని పథకం పన్నాడు. తన ట్రాక్టర్‌తో గంగారాంను ఢీకొట్టి హత్య చేశాడు. అయితే నవీన్‌కు ప్రసాద్ సహకరించారు. దీంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు.