Advertisement
అక్షరటుడే, బాన్సువాడ : Accident : రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన సోమవారం సాయంత్రం బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది. సోమేశ్వర్ గ్రామానికి చెందిన విఠల్, బుడ్మి గ్రామానికి చెందిన దినేష్ వేర్వేరు బైక్‌లపై వెళ్తున్నారు.
పట్టణంలో వీరి బైక్‌లు అదుపుతప్పి ఢీకొన్నాయి. ప్రమాదంలో విఠల్ తలకు బలమైన గాయాలు కాగా, దినేష్ కాలుకు గాయమైంది. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement