అక్షరటుడే, జుక్కల్: మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో డెంగీ కేసులు నమోదయ్యాయి. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ పరీక్షలు చేయించుకోగా రెండు రోజుల కిందట డెంగీ నిర్ధారణ అయినట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం వారిలో ఒకరు నిజామాబాద్, మరొకరు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. వర్షాకాలం కావడంతో గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది పారిశుధ్యంపై ప్రత్యేక చొరవ చూపాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.