అక్షరటుడే, బోధన్: టిప్పర్ వెనుక చక్రాల కింద పడి మూడు మేకలు మృతి చెందిన ఘటన బుధవారం బోధన్ మండలం బండారుపల్లిలో జరిగింది. సిద్దాపూర్ నుంచి సాయంత్రం ఇసుక లోడ్ తో టిప్పర్ వెళ్తుండగా బండారుపల్లి వద్దకు రాగానే మేకలు ప్రమాదవశాత్తు వెనుక చక్రాల కింద పడి నుజ్జునుజ్జయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు టిప్పర్ డ్రైవర్ పై దాడి చేశారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై మశ్చెందర్ అక్కడికి చేరుకుని టిప్పర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.