అక్షరటుడే, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహశీల్దార్ కార్యాలయంపై మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇద్దరు ఆర్ఐలు శ్రీమాన్, శ్రీధర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. దాడుల్లో ఆర్ఐ శ్రీమాన్ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఏసీబీ అధికారులను చూసి మరో ఆర్ఐ శ్రీధర్ పరారీ అయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.