పెట్రోల్ తో పాటు నీళ్లు.. వాహనదారుడి నిరసన

అక్షరటుడే, ఆర్మూర్: బంకులో పెట్రోల్ తో పాటు నీళ్లు రావడంతో ఓ వాహనదారుడు నిరసన చేపట్టాడు. కమ్మర్ పల్లి మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని ఓ బంకులో గాంధీనగర్ కు చెందిన శ్రీనివాస్ తన బైకులో పెట్రోల్ పోయించుకోగా కొంత దూరం వెళ్లేసరికి బైకు నిలిచిపోయింది. బైక్ మెకానిక్ దగ్గరకి తీసుకువెళ్లగా ట్యాంకులో నీళ్లు ఉన్నట్లు గుర్తించాడు. అనంతరం బంకు వద్దకు వెళ్లి ఈ విషయమై ఆరా తీశాడు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బంకు వద్ద నిరసన తెలిపాడు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Betting Apps | ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌