Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తుంది. సౌత్ లో సూపర్ సక్సెస్ తో అదరగొడుతున్న అమ్మడు బాలీవుడ్ లో మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయిన ఆ తర్వాత యానిమల్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. సందీప్ వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ సినిమా 900 కోట్లతో సంచలన విజయం అందుకుంది.
ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పుష్ప 2 సినిమా పాన్ వరల్డ్ వైడ్ గా 1800 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన ఛావా సినిమా తో కూడా 600 కోట్ల పైన కలెక్ట్ చేసింది రష్మిక. ఐతే ఈ సినిమాలన్నిటితో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యింది. రెండేళ్లలో 3 సినిమాల్లో 3300 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది రష్మిక మందన్న.
Rashmika Mandanna : హిందీలోనే 1850 కోట్ల దాకా కలెక్ట్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. హిందీలోనే ఏకంగా 1850 కోట్ల దాకా కలెక్ట్ చేసి ఏ హీరోయిన్ కి సాధ్యం కాని రికార్డ్ ని తన మీద రాసుకుంది. నేషనల్ క్రష్ ట్యాగ్ లైన్ కి ఏమాత్రం తగ్గకుండా రష్మిక సంచలనాలు ఉన్నాయి. రెండేళ్లు మూడు సినిమాలు అమ్మడికి అదిరిపోయే హిట్ అందించాయి.
వీటితో పాటుగా రష్మిక ధనుష్ తో కుబేర సినిమా చేస్తుంది. సల్మాన్ ఖాన్ తో సికందర్ లో కూడా నటిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ అంటూ మరో ఫిమేల్ సెంట్రిక్ సినిమాతో కూడా వస్తుంది రష్మిక మందన్న. ఈ సినిమాలు కూడా రష్మిక మందన్న రేంజ్ ఏంటో తెలిసేలా చేసేలా రాబోతున్నాయి. బాలీవుడ్ లో అలియా భట్, దీపికల మించి ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం కేవలం రష్మిక వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు.