Crime | జీవితంపై విరక్తితో ఇద్దరు యువకుల ఆత్మహత్య

Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Crime | జీవితంపై విరక్తితో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లింగంపేట మండలం శెట్టిపల్లికి చెందిన కమ్మరి ప్రవీణ్ కుమార్(25) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రవీణ్ అమ్మ, నాన్న గతంలో మృతిచెందారు. కాగా.. సోదరి, ప్రవీణ్ ఇద్దరు జీవనం సాగిస్తున్నారు. అతని సోదరి బయటకు వెళ్లిన సమయంలో ప్రవీణ్​ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Crime | మద్యానికి బానిసై..

అక్షరటుడే, నిజాంసాగర్: మండల కేంద్రానికి చెందిన అంద్యాల హరి కుమార్(26) నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా మద్యానికి బానిసయ్యారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో ఈ నెల 1న నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకాడు. అప్పటినుంచి ప్రాజెక్టులో వెతికినప్పటికీ యువకుడి జాడ కనిపించలేదు. మంగళవారం ఉదయం మృతదేహం నీటిఒడ్డుకు వచ్చిందని ఎస్సై తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | నాగన్న బావిని సందర్శించిన విద్యార్థులు