Ugadi Festival : ఉగాది పండుగ ప్రాముఖ్య‌త ఏంటి.. ఆ పండుగ‌ని ఎందుకు జ‌రుపుకుంటారు?

Ugadi Festival : ఉగాది పండుగ ప్రాముఖ్య‌త ఏంటి.. ఆ పండుగ‌ని ఎందుకు జ‌రుపుకుంటారు?
Ugadi Festival : ఉగాది పండుగ ప్రాముఖ్య‌త ఏంటి.. ఆ పండుగ‌ని ఎందుకు జ‌రుపుకుంటారు?

అక్షర టుడే, వెబ్ డెస్క్ Ugadi Festival : ష‌డ్రుచుల స‌మ్మేళ‌నం (Ugadi) ఉగాది. ఈ పండుగ‌ని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో సంతోషంగా జ‌రుపుకుంటారు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగ+ఆది యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం (Telugu Calendar) ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృత యుగం ప్రారంభం అవుతుంది. అందుకే అప్ప‌టి నుండి చైత్రశుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాది పండుగ‌ని జ‌రుపుకుంటున్నాం. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది.. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచంగ శ్రవణం చాలా మంది చేశారు.

Advertisement
Advertisement

Ugadi Festival : ఇది కార‌ణం..

శార్వారి నామ సంవత్సరానికి ముగింపు పలికి ‘ప్లవ’ నామ సంవత్సరానికి స్వాగతం ప‌లుకుతున్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రు పండుగ‌ని ఎంతో సంతోషంగా జ‌రుపుకుంటూ ఉంటారు. ఈ పండగ రెండు రోజులకు ముందే చాలామంది ఇళ్లను శుభ్రం చేసుకుని తోరణాలను కట్టుకుంటూ ఉంటారు. ఉగాదికి ఒక రోజు ముందే కొంతమంది ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు. హిందువులకు Hindus అతిపెద్ద పండగ అయినా ఉగాది రోజున షడ్రుచుల కలయికతో తయారుచేసిన పచ్చడిని చేసి ఇంట్లో అంద‌రు తీసుకుంటారు. పురాణాల ప్రకారం ఆ రోజు చేయకూడని పనులు చేయడం వల్ల భవిష్యత్తులో అనేక రకాల దుష్ప్రభావాలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉందట. మన పండుగలు, ఆచారాలు సంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేపపువ్వు వేసి చేసిన ఉగాది పచ్చడి.

ఇది కూడా చ‌ద‌వండి :  Ugadi Festival : ఉగాది పండుగ రోజు ఈ ప‌నులు ఎవ‌రు చేయోద్దు.. వాటి విష‌యంలో జాగ్ర‌త్త‌

సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించడంతో ‘ఉగాది’ Ugadiఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని హిందువులు విశ్వ‌సిస్తుంటారు. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగ ప్రధానంగా ప్రకృతి పండుగ. శిశిరంలో ఆకులు రాలిపోయి మోడుగా మారిన చెట్లన్నీ వసంతం రాగానే కొత్త చిగుళ్లు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారి ప్రకృతి కాంత పరవశించే సమయంలో జరుపుకునే పండుగగా చెప్పుకుంటారు

Advertisement