అక్షరటుడే, వెబ్‌డెస్క్: అమెరికా (America) లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ (Ukrainian President Volodymyr Zelensky)కి తీవ్ర అవమానం జరిగింది. జెలెన్స్కీని వైట్ హౌస్ నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) గెంటేశారు. శుక్రవారం జరిగిన ప్రెస్మీట్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధమే కొనసాగింది. దీంతో ట్రంప్- జెలెన్స్కీ ప్రెస్మీట్ రద్దు చేశారు. ఈ సందర్భంగా జెలెన్స్కీకి డోనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
జెలెన్స్కీ.. చచ్చిపోతావ్, ఉక్రెయిన్ నాశనం
జెలెన్స్కీకి అమెరికా పట్ల కృతజ్ఞత లేదని ట్రంప్ నిందించారు. వాన్స్, పుతిన్తో తాను రాజీపడే ప్రసక్తే లేదని జెలెన్స్కీ అంటే.. ‘నువ్వు చచ్చిపోతావ్, ఉక్రెయిన్ నాశనం అయిపోయితుందని’ ట్రంప్ బెదిరించారు. యుద్ధం కోసం 350 బిలియన్ డాలర్ల సాయం చేశామని ట్రంప్ అన్నారు. అమెరికా అండ లేకుంటే.. ఉక్రెయిన్ రెండు వారాల్లోనే ఓడిపోయేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘మా స్టుపిడ్ ప్రెసిడెంట్ జో బైడెన్(Joe Biden) నీకు అనవసరంగా సాయం చేశాడని’ ట్రంప్ నిందించారు. మినరల్స్ డీల్‌పై జెలెన్స్కీ సంతకం చేయాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు.
వేడెక్కిన ప్రపంచ రాజకీయం
వైట్ హౌస్ నుంచి జెలెన్స్కీ గెట్ అవుట్ ఉదంతంతో ప్రపంచ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అమెరికా అండతో గత మూడేళ్లుగా రష్యాను ఎదురిస్తూ వస్తున్న ఉక్రెయిన్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ట్రంప్, జెలెన్స్కీలతో ఫోన్లో బ్రిటన్ ప్రధాని(Britain Prime Minister) మాట్లాడారు. ఉక్రెయిన్కు తమ మద్దతులో ఎలాంటి మార్పు లేదని బ్రిటన్ ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నీ మరో యుద్ధానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.