అక్షరటుడే, వెబ్‌డెస్క్ : భర్త మృతి తట్టుకోలేక భార్య బలవన్మరణం చేసుకున్న ఘటన ఏపీలోని విజయవాడలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన నాగరాజు, ఉషలకు 18నెలల క్రితం పెళ్లి అయ్యింది. ఉద్యోగరీత్యా రోజులాగే నాగరాజు తన బైక్‌పై ఇవాళ ఉదయం బయలుదేరాడు. ఇంటి నుంచి కొంత దూరం వెళ్లే సరికే వేగంగా వచ్చిన మరో బైక్ నాగరాజు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈవిషయం తెలిసిన ఉష భర్తలేని జీవితం తనకు వద్దనుకొని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య భర్తలు ఇద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.