POWER CUT | నగరంలో అప్రకటిత కరెంట్​ కోతలు
POWER CUT | నగరంలో అప్రకటిత కరెంట్​ కోతలు
Advertisement

అక్షరటుడే, ఇందూరు: POWER CUT | అప్రకటిత కరెంట్​ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం నిజామాబాద్ నగరంలోని వినాయక్​నగర్ (VINAYAK NAGAR)​, పూలాంగ్​ చౌరస్తా(PULANG CHOWRASTHA) తదితరల ప్రాంతాల్లో మధ్యాహ్నం కరెంట్ సరఫరా నిలిచింది. సుమారు 4 గంటలకు పైగా విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలతో పాటు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.

వాస్తవానికి విద్యుత్ కోతలపై అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చేవారు. కానీ, శుక్రవారం ఎలాంటి ప్రకటన చేయకుండానే కోత విధించారు. ఒకవైపు ఎండలు ముదిరిపోవడం.. మిట్ట మధ్యాహ్నం వేళ విద్యుత్​ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. విద్యుత్​ అధికారులకు సంప్రదించినప్పటకీ.. స్పందన లేకుండా పోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  NIZAMABAD CITY | తాగునీటి కొరత రాకుండా చూడాలి