అక్షరటుడే, ఇందూరు: గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో గల ఆయా విభాగాల్లో అభ్యర్థులను నియమించారు. అయితే విద్యాశాఖకు సంబంధం లేకుండా ఫౌండేషన్ ప్రతినిధులు రెండు లెటర్ హెడ్ లతో అక్రమంగా అభ్యర్థులను నియమించారని విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. విచారణ జరిపితే నకిలీ సర్టిఫికెట్లతో నియామకమైనట్లు తేలిందన్నారు. ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారి ఆదేశానుసారం గ్లోబల్ ఫౌండేషన్ సీఈవో బాబర్, ప్రతినిధి ఆర్.రాజు పై సంబంధిత పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు పెట్టినట్లు తెలిపారు.