అక్షరటుడే, ఇందూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రస్థాయి బాలికల అండర్-17 హాకీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి నాగమణి తెలిపారు. పోటీలు నవ్య భారతి గ్లోబల్ పాఠశాలలో ఉంటాయన్నారు. పాత ఉమ్మడి జిల్లాల క్రీడాకారిణిలు పాల్గొంటారని పేర్కొన్నారు.