అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆ రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల స్థాపన, పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా దేశంలోనే అతిపెద్ద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్.. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో 1,600 ఎకరాల్లో ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు.
రూ. 1.85 లక్షల కోట్ల పెట్టుబడితో..
దేశానికి చెందిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను 2021లో ప్రారంభించారు. 2030 నాటికల్లా.. ఏడాదికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. రూ.1,85,000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం ఈ హబ్ లక్ష్యం. ఇక్కడ 4,500 టన్నుల ఆకుపచ్చ అమ్మోనియా, 1,500 టన్నుల గ్రీన్ మిథనాల్, 1,500 టన్నుల గ్రీన్ యూరియా కూడా ప్రోడక్ట్ కానుంది.