అక్షరటుడే, వెబ్‌డెస్క్: UNESCO | భారతదేశ నాగరిక వారసత్వానికి India’s cultural heritage గణనీయమైన గుర్తింపుగా భావించే భగవద్గీతకు Bhagavad Gita యునెస్కో UNESCO గుర్తింపు లభించింది.
అలాగే, భరత ముని నాట్యశాస్త్రం ప్రాశస్త్యాన్ని Bharata Muni’s Natyashastra Prasad కూడా యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ UNESCO Memory of the World రిజిస్టర్‌లో చోటు దక్కింది. ఈ మేరకు కేంద్ర సంస్కృతి Union Minister for Culture, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ Tourism Gajendra Singh Shekhawat ఓ ప్రటనలో తెలిపారు.
దీనిని “భారత నాగరిక వారసత్వానికి చారిత్రాత్మక క్షణం” historic moment for India’s cultural heritage అని ఆయన అభివర్ణించారు. ఈ కాలాతీత రచనలు సాహిత్య timeless works సంపద కంటే ఎక్కువ – అవి భారత్ ప్రపంచ దృష్టికోణాన్ని, మనం ఆలోచించే, అనుభూతి చెందే, జీవించే వ్యక్తీకరించే విధానాన్ని రూపొందించిన తాత్విక, సౌందర్య పునాదులు అని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు చెందిన 14 అంశాలు యూనెస్కో రిజిస్టర్‌లో UNESCO Register నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు.
UNESCO | భారతీయులకు గర్వకారణం
మన ప్రాచీన భగవద్గీతకు యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Prime Minister Narendra Modi హర్షం వ్యక్తం చేశారు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమైన క్షణం” అని ఎక్స్‌లో అభివర్ణించారు. “యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో UNESCO Memory of the World Register భగవద్గీత, నాట్యశాస్త్రం చేర్చడం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు global recognition. గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికత, చైతన్యాన్ని పెంపొందించాయి. వాటి అంతర్దృష్టులు ప్రపంచాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి.” అని పేర్కొన్నారు.