అక్షరటుడే, వెబ్డెస్క్: Ntr | RRR తర్వాత ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో తారక్ ది నెగిటివ్ రోల్ అని టాక్. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతుంది. వార్ 2 తన పోర్షన్ పూర్తి చేసిన ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈమధ్యనే రామోజి ఫిల్మ్ సిటీలో ఆ సినిమా షూటింగ్ మొదలైంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ ని లాక్ చేశారు. కన్నడలో ఇప్పుడే పాపులారిటీ తెచ్చుకుంటున్న రుక్మిణి సప్త సాగరాలు దాటి డబ్బింగ్ వెర్షన్ తో తెలుగు ఆడియన్స్ కు నచ్చేసింది. ఇప్పటికే అమ్మడు నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది.
Ntr | కమిటయ్యే టైం లోనే అమ్మడికి..
ఐతే ఎన్టీఆర్ నీల్ సినిమాలో రుక్మిణి లక్కీ ఛాన్స్ అందుకోగా ఆ సినిమాకు కమిటయ్యే టైం లోనే అమ్మడికి చాలా కండీషన్స్ పెట్టారని తెలుస్తుంది. అదేంటి అంటే ఎన్టీఆర్ నీల్ సినిమా పూర్తి అయ్యే వరకు రుక్మిణికి మరో సినిమా ఛాన్స్ వచ్చినా చేయకూడదని అన్నారట. సినిమాకు ఎప్పుడు అంటే అప్పుడు డేట్స్ ఇచ్చేలా అందుబాటులో ఉండాలని అన్నారట.
సో సినిమా మొదలయ్యే టైం నుంచి రిలీజ్ అయ్యే వరకు రుక్మిణి లాక్ అయినట్టే లెక్క. ఐతే ఈ కండీషన్స్ ఒప్పుకున్నందుకు అమ్మడికి మంచి పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ అయ్యే వరకు అది ఎన్నేళ్లు పట్టినా కూడా రుక్మిణి మరో సినిమా చేసే ఛాన్స్ లేదన్నట్టే అని చెప్పొచ్చు.ఇది ఒకరకంగా హీరోయిన్ కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది కానీ. ఎన్ టీ ఆర్ సినిమా అంటే ఈమాత్రం రిస్క్ లేకపోతే ఎలా అనుకుని రుక్మిణి కూడా మేకర్స్ కండీషన్స్ కి ఓకే అనేసింది.