Puri Temple | విచిత్ర ఘ‌ట‌న‌… పూరీ క్షేత్రంలో ఎగిరే జెండాను ఎత్తుకెళ్లిన గద్ద

Puri Temple | విచిత్ర ఘ‌ట‌న‌... పూరీ క్షేత్రంలో ఎగిరే జెండాను ఎత్తుకెళ్లిన గద్ద
Puri Temple | విచిత్ర ఘ‌ట‌న‌... పూరీ క్షేత్రంలో ఎగిరే జెండాను ఎత్తుకెళ్లిన గద్ద

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Puri Temple | పూరీలోని జగన్నాథ ఆలయం దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పూరీలోని జగన్నాథ ఆలయం మీదుగా పక్షులు లేదా విమానాలు aeroplanes ఎగరవు అనేది ఎప్ప‌టి నుండో ఉంది.

Advertisement
Advertisement

మత సిద్ధాంతం ప్రకారం, జగన్నాథుడిని హిందూ పురాణాలలో అత్యంత గౌరవనీయమైన పక్షి రాజు “గరుడ దేవ్” (Garuda Dev) మోసుకెళ్తాడు. ఋగ్వేదం ప్రకారం, జగన్నాథుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు. అందుకే గరుడు తన ఆలయంగా భవిస్తాడు. గరుడ దేవ్ అనేది విష్ణువు రథంగా చెప్పుకుంటారు” గరుడదేవుడు పక్షుల రాజు కాబట్టి, ఆయన స్వయంగా ఆలయాన్ని ప‌రిరక్షిస్తున్నాడు. అందుకే పక్షులు దానిపై ఎగరడానికి ఇష్టపడవు అని భావిస్తారు. పూజారులు మరియు ఇత‌రులు కూడా దీనిని తమ మతపరమైన నమ్మకంగా భావిస్తారు.

Puri Temple | దేనికి సంకేతం..

తాజాగా పూరీ జగన్నాథ Puri jagannath క్షేత్రంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జగన్నాథుడు కొలువైన ఆలయం శిఖరం నీల చక్రంపై ఎగిరే జెండాను ఓ గద్ధ (గరుడ) పట్టుకెళ్లడం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆకర్షించింది. పూరీకి వచ్చే భక్తులు ఆలయ శిఖరంపైన నీలచక్రంపై నిత్యం ఎగిరే పతిత పావన జెండాను ప్రత్యేకంగా దర్శనం చేసుకుని మొక్క‌డం ఎప్ప‌టి నుండో ఆన‌వాయితీగా మారుతూ వ‌స్తుంది. అయితే అలాంటి ప‌విత్ర‌మైన జెండాని ఓ గ‌ద్ధ ప‌ట్టుకెళ్లి ఆకాశంలో చ‌క్క‌ర్లు కొట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిత్యం సాయంత్రం 5 గంటల సమయంలో పూరీలో జెండా మార్చే పద్ధతి నేటికీ కొనసాగుతోంది.

భక్తులు సమర్పించే మొక్కుబడుల జెండాలను చక్రం దిగువ కడుతారు. పైన 14మూరల పావన జెండా ఎగురుతూ ఉంటుంది. అలాంటి పవిత్రమైన జెండాను Flag ఎన్నడూ లేనివిధంగా ఓ గరుడ పక్షి లాక్కెళ్లి ఆకాశంలో చక్కర్లు కొట్టడాన్ని భక్తులు వింతగా గ‌మ‌నిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ గా మారాయి. ఈ సంఘటన దేనికి సంకేతమంటూ చర్చోపచర్చల్లో భక్తులు, పండితులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. జ‌గన్నాథ ఆలయం దాదాపు 1,000 అడుగుల ఎత్తు ఉంటుంది. దానిపై నుండి విమానాలు కూడా ఎగ‌ర‌వు. అలాంటిది ప‌క్షి అలా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement