అక్షరటుడే, కోటగిరి: ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుకు దుండగులు నిప్పుపెట్టారు. తహశీల్దార్‌ మల్లయ్య కథనం ప్రకారం.. పొతంగల్‌ మండలం కొడిచెర్ల శివారులో సిర్పూర్‌ మార్గంలో నెల కిందట చెక్‌పోస్టు ఏర్పాటు చేయగా, ప్రతిరోజు సాయంత్రం వేళల్లో రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సిబ్బంది వెళ్లగా, అప్పటికే చెక్‌పోస్ట్‌ కాలిపోయి ఉంది. దీంతో బుధవారం కోటగిరి ఎస్సై సందీప్‌కు ఫిర్యాదు చేశారు. ఇసుక మాఫియాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.