అక్షరటుడే, వెబ్​డెస్క్​: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ నిజామాబాద్​(ఇందూరు) పేరును ప్రస్తావించారు. బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా గురువారం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. తెలంగాణకు కేటాయించిన నిధుల గురించి వివరించారు. ఇందులో భాగంగా పసుపు బోర్డు అంశాన్ని గుర్తు చేశారు. నిజామాబాద్​లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అలాగే ఇందిరా గాంధీ గెలిచిన మెదక్​ నియోజకవర్గంలో రైల్వే స్టేషన్​ను ఏర్పాటు చేసింది కూడా తమ ప్రభుత్వమేనని తెలిపారు. విభజన సమయంలో మిగులు బడ్జెట్​తో ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పులకుప్పగా మారిందన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Eye test | చిన్నారులకు కంటి పరీక్షలు