farmers | పాడి రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ ప‌థ‌కం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..

farmers | పాడి రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ ప‌థ‌కాల కోసం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇది..!
farmers | పాడి రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ ప‌థ‌కాల కోసం ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇది..!
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: farmers | క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్.. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పధకం కింద ఇండియాలోని పశువుల్లో వచ్చే వ్యాధుల్ని కంట్రోల్ చేసేలా ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. ఈ పథకం ఫుట్ అండ్ మౌత్ డిసీజ్(foot and mouth disease), బ్రూసెల్లోసిస్(Brucellosis) లాంటి వ్యాధుల్ని అరికడుతుంది. కేంద్ర ప్రభుత్వం(Union government) ఈ పథకం కోసం రూ.3,880 కోట్లను కేటాయించింది. ఈ ప్రోగ్రామ్ కింద రైతుల దగ్గర ఉన్న పాడి పశువులకు టీకాలు, వైద్యం, వ్యాధి నిర్వహణ సేవలు లాంటివి లభిస్తాయి. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు లబ్ధి పొందుతారు. ఈ పథకం ప్రయోజనాలు కోసం రైతులు తమ స్థానిక పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి. రైతుల గుర్తింపు పత్రం, భూమి యాజమాన్య పత్రాలు, పశువుల వివరాలను అందజేయాలి.

Advertisement

farmers | ప్ర‌క్రియ ఇది..

అధికారులు పశువులను పరిశీలించి, టీకా కార్యక్రమంలో చేర్చుతారు. వీటికి కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో apagrisnet.gov.inను సందర్శించవచ్చు. తెలంగాణలో agri.telangana.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ వల్ల పశువుల మరణాలు తగ్గి, పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ పథకం పొందాలంటే రైతుకు కనీసం ఒక పశువు కలిగి ఉండాలి. ఈ క్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.13,343 కోట్లతో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పశుసంపదను కాపాడుకోవచ్చు.

ఈ కారణంగా రైతుల ఆదాయం పెరుగుతుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. అందువల్ల పాడి రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు కేంద్రం సూచిస్తోంది. ప్రస్తుత రోజుల్లో పశువుల సంఖ్య బాగా పెరిగింది. ఉన్న పశువులకి అనారోగ్యం వచ్చినా, చనిపోయినా.. రైతు కోలుకోవడం కష్టంగా మారుతోంది. పశువులకి అసలు వ్యాధులే రాకుండా చూసుకుంటే ఇంకా మంచిదనేది కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు అధికారులు ప్రత్యేకంగా కోరుతున్నారు.