సైబర్‌ సెక్యూరిటీ లేకుండా దేశాభివృద్ధి అసాధ్యం

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సైబర్‌ సెక్యూరిటీ లేకుండా ప్రస్తుత తరుణంలో దేశాభివృద్ధి అసాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఢిల్లీలో మంగళవారం ఇండియన్‌ సైబర్‌ క్రైం కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. టెక్నాలజీ మానవాళికి ఓ వరం అని.. ఆర్థిక వ్యవస్థను పెంపొందించేందుకు సాంకేతిక ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అందుకే సైబర్‌ సెక్యూరిటీ జాతీయ భద్రతలో ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు.