అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : గ్రూప్‌-1 అభ్యర్థులు ఛలో సెక్రటేరియట్‌ ఉద్రిక్తంగా మారింది. అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ర్యాలీలో పాల్గొన్నారు. కాగా.. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో లోయర్‌ట్యాంక్‌ బండ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అభ్యర్థులపై కూడా దాడి చేయడంతో పాటు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బండి సంజయ్‌కు సీఎం ఫోన్‌..

ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్‌ చేశారు. గ్రూప్‌-1 పరీక్షల వ్యవహారంపై చర్చలకు ఆహ్వానించారు.