Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఎన్నికల కోడ్​ సాకుతో రైతు భరోసా ఆపొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల పొట్టకొట్టవద్దని.. ఎన్నికలు కేవలం గ్రాడ్యుయేట్లు, టీచర్లకే పరిమితమని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టారని.. అర్హులందరికీ రేషన్​ కార్డులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కొనసాగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

Advertisement