Union Minister Jaishankar : పాక్​ పెంచి పోషించిన ఉగ్రవాదం ఆ దేశాన్నే కాటేస్తోంది : కేంద్ర మంత్రి జైశంకర్

Union Minister Jaishankar : పాక్​ పెంచి పోషించిన ఉగ్రవాదం ఆ దేశాన్నే కాటేస్తోంది : కేంద్ర మంత్రి జైశంకర్
Union Minister Jaishankar : పాక్​ పెంచి పోషించిన ఉగ్రవాదం ఆ దేశాన్నే కాటేస్తోంది : కేంద్ర మంత్రి జైశంకర్

అక్షర టుడే, వెబ్ డెస్క్ Union Minister Jaishankar : పాకిస్తాన్ (Pakistan) పెంచి పోషించిన ఉగ్రవాదమే ఆ దేశాన్ని కాటు వేసేందుకు తిరిగి వస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (Union Minister Jaishankar) అన్నారు. 2014లో మన దేశంలో ప్రభుత్వం మారిన తర్వాత.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే తగిన పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్​కు గట్టి సందేశం ఇచ్చినట్లయిందన్నారు. డబుల్ గేమ్ ఆడుతున్న పాకిస్తాన్ గురించి మాట్లాడడమంటే విలువైన సమయాన్ని వృథా చేయడమేనని కొట్టిపాడేశారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్ గురించి బహిరంగంగా ఎందుకు అరుదుగా చర్చిస్తుందని మంగళవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు జైశంకర్ దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ‘వారి (పాకిస్తాన్) (Pakistan) కోసం విలువైన సమయాన్ని వృథా చేయాల్సిన అవసరం లేదని’ స్పష్టం చేశారు.

Advertisement

“భారతదేశం మారిపోయింది. దురదృష్టవశాత్తు వారు (పాక్) అనేక విధాలుగా తమ చెడు అలవాట్లను కొనసాగిస్తున్నారు. రెండు దేశాల ద్వైపాక్షి సంబంధాల్లో 26/11 ముంబై ఉగ్రవాద దాడి కీలక మలుపు అని చెబుతాను. రాజకీయ పార్టీలకు అతీతంగా భారతీయ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తీవ్రంగా ఖండించిన ఘటన ఇదేనని” ఆయన అన్నారు. నవంబర్ 26, 2008న పదిమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలోని అనేక ప్రదేశాలలో దాడులు చేసి 166 మందిని పొట్టన బెట్టుకున్నారు. అయితే, 2014లో కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పాకిస్తాన్​కు గట్టి సందేశం వెళ్లిందన్నారు. ఉగ్రవాదాన్ని పెంపి పోషిస్తే తగిన పరిణామాలు ఉంటాయన్న విషయం వారికి అర్థమైందన్నారు. అప్పటి నుంచి ప్రపంచంలో ఇండియా స్థానం పెరిగిందని, కానీ పాకిస్తాన్ స్థానం పెరగలేదని ఎద్దేవా చేశారు. ” మనం ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాం. ప్రపంచంలో మన స్థానం మెరుగుపడింది. కానీ పాకిస్తాన్ పాత వ్యూహాన్నే కొనసాగించింది” అని ఆయన అన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Earthquake | పాకిస్థాన్‌లో భారీ భూకంపం

పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదమే ఆ దేశాన్ని కాటు వేయడానికి తిరిగి వచ్చిందని జైశంకర్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ఏదో పొందాలని ప్రయత్నించిందన్నారు. “పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతున్నది. ఒకవైపు తాలిబన్లతో, అలాగే మరొక వైపు కూడా ఉంది. కానీ అమెరికన్లు వెళ్ళిపోయినప్పుడు డబుల్ గేమ్ను నిలబెట్టుకోలేకపోయింది. డబుల్ గేమ్ నుంచి వారు పొందుతున్న ప్రయోజనాలు ఏవైతేనేం అవి కూడా పడిపోయాయి. అంతేకాకుండా, వారు ప్రోత్సహించిన ఉగ్రవాదం కూడా వారిని కాటు వేయడానికి తిరిగి వచ్చింది” అని జైశంకర్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీ బ్రాండ్ టెక్నాలజీ అయితే.. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదంతో ముడిపడి ఉందన్నారు.

Advertisement