అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు కుటుంబ పార్టీలేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆచరణ సాధ్యంకాని హామీలను ఇచ్చి తెలంగాణ, కర్నాటక, హిమచల్‌ప్రదేశ్‌ల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీపార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాలు దివాళా తీస్తే నష్టపోయేది పేదలు, సామాన్య ప్రజలేనని పేర్కొన్నారు. మోసపూరిత డిక్లరేషన్‌తో ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్‌ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఆరుగ్యారెంటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయడంలేదన్నారు. రాష్ట్రంలో అప్పులు తీర్చడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు.