అక్షరటుడే, వెబ్‌డెస్క్: కొమురవెళ్లి రైల్వే స్టేషన్ నిర్మాణంతో మల్లన్న భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ హాల్ట్ స్టేషన్ అందుబాటులోకి వస్తే మల్లన్న ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు ప్రయాణ సౌకర్యం మెరుగు పడుతుందని పేర్కొన్నారు. మనోహరాబాద్-సిద్దిపేట రైల్వే మార్గంలో మల్లన్న ఆలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. దీనికి మంత్రి కిషన్‌రెడ్డి ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయి. పనులకు సంబంధించిన చిత్రాలను కేంద్ర మంత్రి ఎక్స్‌లో పోస్టు చేశారు. 400 మీటర్ల ప్లాట్‌ఫామ్‌తో రైల్వేస్టేషన్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సౌలభ్యం కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.