అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది తమ డిమాండ్‌ అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారన్నారు. గవర్నర్‌ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్‌ ఒపీనియన్‌ తీసుకోవాల్సి ఉంటుందని, ఈక్రమంలో జాప్యం జరిగితే తొందర పాటు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని చెప్పడం అవివేకమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు తాము డిమాండ్‌ చేశామని, రేవంత్‌రెడ్డి విచారణ కోరారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.