అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి కొత్త బస్టాండ్ ప్రాంగణంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్టాండ్ ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను కేంద్రమంత్రి అభినందించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, నాయకులు రంజిత్ మోహన్, నరేందర్ రెడ్డి, ఈశ్వర్, గంగాధర్ రావు, రాజు, సునీత, రమ్య, భావన, మమత తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కేంద్రమంత్రికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సింధుశర్మ, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.