అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో గల డ్రైనేజీలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం ఉదయం డ్రెయినేజీలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడి మృతి చెంది ఉంటాడా.. లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement